ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య ఉండవల్లిలోని సీఎం నివాసంలో సుమారు రెండు గంటల పాటు కీలక భేటీ జరిగింది. మంగళగిరిలో ‘ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం’ సందర్భంగా జరిగిన అటవీ శాఖ ‘హనుమాన్’ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ముగించుకుని పవన్ నేరుగా సీఎం వద్దకు వెళ్లారు. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపై చర్చ జరిగింది. 
![]()
