ప్రజలకు భూ వివాదాలు లేకుండా, రికార్డుల్లో తప్పులు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని సిఎం చంద్రబాబు తెలిపారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం రాష్ట్ర మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతన సంవత్సర కానుకగా రాజముద్రతో కూడిన 22 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతో గ్రామంలో రెవెన్యూ సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయన్నారు. వివాదాలు లేని స్థలాలను కూడా రీసర్వే పేరుతో అడ్డదిడ్డంగా చేసి వివాదాస్పదంగా చేశారన్నారు. 
![]()
