ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించిన అసైన్డ్ భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను క్షుణ్ణంగా పునఃపరిశీలించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. మంగళవారం అమరావతిలో రెవెన్యూ శాఖ పనితీరుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫ్రీహోల్డ్ విధానంతో పాటు 22ఏ (బి-ఫారం) రీసర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు.
![]()
