రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రాబోయే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో స్పష్టం చేశారు. ఈ నియామకాల కోసం పూర్తిస్థాయిలో న్యాయపరమైన చిక్కులను అధిగమించి, కొత్త నోటిఫికేషన్ జారీ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన ప్రకటించారు.
![]()
