వాజ్పేయి వంటి ఉన్నత స్థాయి నాయకులతో రాజకీయం చేసిన తనకు ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయం చేయాలంటే సిగ్గుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్ర ఆగదని, సంపద, ఆరోగ్యం, ఆనందం ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గతంలో వాజ్పేయి, ఇప్పుడు నరేంద్ర మోదీ తనకు స్ఫూర్తినిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
![]()
