అమరావతి : రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులద్వారా ఏర్పాటయ్యే పరిశ్రమలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారు
లను ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రి నేతృత్వంలో సచివాలయంలో జరిగిన 13వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో 20,444 కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 26 సంస్థలకు వారి యూనిట్లు ఏర్పాటుచేసుకునేందుకు అనుమతిచ్చారు. తద్వారా 56,278 ఉద్యోగాలు కల్పన జరుగుతుందని వివరించారు. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సుపైనా చంద్రబాబు సమీక్షించారు. దాదాపు 13 లక్షల కోట్ల వరకు ఒప్పందాలు జరగ్గా, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ పెట్టుబడులు త్వరగా క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ అయ్యేలా చూడాలని, దీనికోసం ఆయా సంస్థలతో అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. సత్వర గ్రౌండింగ్ కోసం తనతోపాటు చీఫ్ సెక్రటరీ, మంత్రులు, ఇతర శాఖల అధికారులు కూడా పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. ఎన్ఐపిబి సమావేశంలో ఆమోదాలే కాకుండా ఎర్లీబర్డ్ ప్రోత్సాహకాల కింద మరో ఆరు సంస్థలకు కూడా అనుమతులు ఇచ్చినట్లు అధికారులు వివరించారు.
![]()
