యువతకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని, న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి నియామకాలు పూర్తి చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో, రాజకీయ ముసుగులో నేరాలు చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఆయన గట్టిగా సూచించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ పరేడ్ మైదానంలో కొత్తగా ఎంపికైన 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన అనంతరం ఆయన ప్రసంగించారు.
![]()
