ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతి పర్యటనలో భాగంగా తనను కలిసిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆయన పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని చంద్రబాబు బలంగా కోరారు.
![]()
