ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై ప్రకటన చేశారు. ఈ సంఘటన తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, వరలక్ష్మి డెయిరీకు చెందిన కల్తీ పాలు సేవించడంతోనే పలువురు అస్వస్థతకు గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది. బాధ్యులపై సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసినట్లు సీఎం తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు అధికారులను ఆదేశించినట్లు కూడా పేర్కొన్నారు.
![]()
