రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజన, డివిజన్ కేంద్రాలు, మండలాల మార్పులు, చేర్పులు గురించి సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పారిశ్రామిక వర్గాలకు భూ కేటాయింపులు, రాయితీలు గురించి కూడా చర్చించే అవకాశం ఉంది.
![]()
