ఆంధ్రప్రదేశ్లో ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 6,100 పోస్టులకు గాను 6,014 మందిని ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లతో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశం కానున్నారు.
మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
![]()
