పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను ఎగవేతదారుల వద్ద పెండింగ్ బకాయిలు వసూలు చేయడానికి అవసరమైతే పోలీసు శాఖ సహకారం కూడా పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆదాయాన్ని
సమకూర్చే శాఖల పనితీరుపై జరిగిన సమీక్షలో, వినియోగదారులపై అతిగా కఠినంగా వ్యవహరించవద్దని సూచించినప్పటికీ, పన్ను వసూళ్ల విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్ర జీఎన్డీపీ వృద్ధిరేటు జాతీయ సగటును మించిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఖజానాకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు సమర్పించారు.
![]()
