ప్రస్తుతం పిల్లలే ఆస్తి, తల్లిదండ్రుల భవిష్యత్ అని గమనించాలని అన్నారు. ఆధునిక ప్రపంచంలో నైతిక విలువలు కొరవడ్డాయని ఇప్పడు నైతిక విలువలతో కూడిన సమాజం సృష్టిగా పనిచేస్తున్నామని చెప్పారు. చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని గ్రామంలో పర్యటించిన సీఎం మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ పాల్గొన్నారు. మంత్రి లోకేశ్‌తో కలిసి ఏపీ మోడల్ స్కూల్లో భోదనకు సంబంధించిన వినూత్న పద్ధతుల ప్రదర్శనను తిలకించారు. రాష్ట్ర సమగ్ర శిక్షా రూపొందించిన ప్రాథమిక నమూనా తరగతి గదిని పరిశీలించారు. విద్యార్థుల మధ్య సీఎం, మంత్రి కూర్చొని వారితో ముచ్చటించారు. తరగతి గదిలో బోధన, తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
![]()
