ఏలూరు జిల్లా పోలవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4వ సారి పోలవరం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలవరం నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ పనులపై ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
![]()
