దేశంలో సాంకేతిక విప్లవం ఎంత వేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ తపాలా ఉద్యోగుల సేవలు మాత్రం ఎప్పటికీ ప్రాసంగికంగానే ఉంటాయని ముఖ్యమంత్రి నారా
నాయుడు అన్నారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన గ్రామీణ డాక్ సేవక్‌ల రాష్ట్ర సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి గ్రామీణ పోస్టుమాస్టర్లు, డాక్ సేవక్‌లు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా విచ్చేశారు.ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన డాక్ సేవక్‌లను అవార్డులతో సత్కరించారు. వారికి ప్రత్యేకంగా రూపొందించిన డ్రస్ కోడ్, బ్యాగులు, టోపీలు అందజేశారు. త్వరలో గ్రామీణ తపాలా ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తపాలా శాఖకు 150 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందని గుర్తుచేశారు. స్వాతంత్య్ర సమర కాలంలోనూ తపాలా వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లాజిస్టిక్ వ్యవస్థ నిలబడటానికి డాక్ సేవక్‌లే మూలస్థంభమని, ఎంత ఆధునిక సాంకేతికత వచ్చినా మానవీయ స్పర్శతో సేవలందించేది వారేనని ప్రశంసించారు.
![]()
