పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన “స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, స్వచ్ఛత, ఉపాధి అవకాశాలపై పలు ముఖ్య ప్రకటనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి చెత్త సేకరణను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎక్కువ శాతం మున్సిపాలిటీల్లో డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతోందని, త్వరలో అన్ని పంచాయతీల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. చెత్త నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా దృష్టి పెట్టిందని తెలిపారు. పింఛన్లు, మహిళా సాధికారత, రైతు సంక్షేమం వంటి అంశాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. విశాఖపట్నంలో డేటా సెంటర్లు, అమరావతిలో ఆధునిక సాంకేతిక కేంద్రాల ఏర్పాటుతో యువతకు కొత్త అవకాశాలు సృష్టిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.వినుకొండలో 100 పడకల ఆసుపత్రిని 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ట్రామా కేర్, డయాలసిస్ సెంటర్లు, బస్టాండ్ ఆధునీకరణ వంటి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతోనే “స్వర్ణాంధ్ర” సాధ్యమని సీఎం అన్నారు.
![]()
