పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా బృందం సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సినిమా చరిత్రలో తొలిసారిగా, అభిమానుల చేతుల మీదుగా తొలి పాట లిరిక్ షీట్‌ను ఆవిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు లక్ష మంది అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది.
‘దేఖ్ లేంగే సాలా’ అంటూ సాగే ఈ పాట లిరిక్ షీట్‌ను లాంచ్ చేసేందుకు అభిమానులు చిత్ర బృందం సూచించిన వెబ్సైట్లోకి వెళ్లి కొన్ని సులభమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. లక్ష మంది తమ ఎంట్రీలను నమోదు చేసిన వెంటనే, అదే వెబ్సైట్లో లిరిక్ షీట్ ప్రత్యక్షమవుతుంది. ఈ వినూత్న ప్రచారంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ పాటను ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు.
![]()
