“ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే వాళ్లకు మంచి అనుభూతిని అందించే చిత్రాలు చేయాలి. అందుకే నా ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకుంటా” అన్నారు హీరో రోషన్. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారు. అనస్వర రాజన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ లో మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహించారు..
హీరో రోషన్ మాట్లాడుతూ
“నిజానికి హీరోలంతా 25ఏళ్ల వయసులోనే తెరపైకి వస్తుంటారు. కానీ, నేను 21ఏళ్లకే వచ్చేశాను. వాస్తవానికి యాక్టింగ్ అంటే చాలా భావోద్వేగాలు తెలియాలి. దానికి ఒక పరిణతి కావాలి. అందుకే ‘పెళ్లి సందడి’ తర్వాత కావాలని గ్యాప్ తీసుకున్నా. నటుడిగా నన్ను నేను చాలా మార్చుకున్నాను. ఈక్రమంలోనే ఈ ‘ఛాంపియన్’తో మూడేళ్లు ప్రయాణం చేశాను. ఇప్పుడు సరైన వయసులో.. సరైన కథతో తిరిగి తెరపైకి వస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు..
![]()
