పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు అదిరిపోయే న్యూ ఇయర్ సర్ప్రైజ్ వచ్చింది. పవన్ 32వ చిత్రాన్ని ఇవాళ అధికారికంగా ప్రకటించారు. టాలీవుడ్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రామ్ తాళ్ళూరి నిర్మించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథను అందిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
![]()
