పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, విలక్షణ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. రొమాంటిక్ కామెడీ హారర్ జానర్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ‘సహానా సహానా’ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. ఇది ఒక సోల్ఫుల్ మెలోడీగా సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.
పూర్తి పాటను డిసెంబర్ 17వ తేదీ సాయంత్రం 6:35 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
![]()
