సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ విజయంతోనే ఇప్పుడు తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
‘జైలర్’ మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి అగ్ర నటులు అతిథి పాత్రల్లో మెరిసి అభిమానులను అలరించారు. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ, ‘జైలర్ 2’ను మరింత భారీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఈ హైప్‌ను మరింత రెట్టింపు చేశాయి.
![]()
