పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రముఖ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘ది రాజా సాబ్’ నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న నటి రిద్ధి కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె ‘అనిత’ అనే పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
![]()
