అక్కినేని అఖిల్ హీరోగా, మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆమె ‘భారతి’ అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు.
![]()
