గ్రామీణ పేదలకు పట్టెడన్నం పెడుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజిఎన్ఆర్ఇజిఎ) చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ చట్టం పేరు మార్చే సాకుతో పేదల ‘ఉపాధి’ ఉసురు తీసేందుకు కుట్ర పన్నుతోంది. ఎంజిఎన్ఆర్ఇజిఎ రద్దు కోసమే ఉద్దేశించిన బిల్లుగా ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ‘విబి-జి రామ్ జి’ బిల్లును ప్రతిపక్షాల నిరసనల మధ్యనే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. దీంతో ప్రతిపక్షాల సభ్యులు లేచి ముక్తకంఠంతో వ్యతిరేకించారు. జాతిపిత మహాత్మాగాంధీని అవమానించడానికి వీలు లేదని నినాదాలతో హోరెత్తించారు. గాంధీజీ చిత్రపటాలు చేబూని సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. దీంతో సభా కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదాపడ్డాయి.
![]()
