న్యూ ఢిల్లీ : దేశంలో 1,068 హెక్టార్ల రైల్వే భూమి ఆక్రమణకు గురైందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన తెలిపారు. 2025 మార్చి 31 నాటికి ఇండియన్ రైల్వేల ఆధీనంలో ఉన్న మొత్తం భూమి దాదాపు 4.99 లక్షల హెక్టార్లు కాగా, అందులో 1,068.54 హెక్టార్లు దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా కాలంగా ఆక్రమణకు గురయ్యాయని సభలో ఆయన తెలిపారు. ![]()
