కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న ఆందోళనగా కనిపించారని, ఆయన ఉపయోగించిన భాష కూడా సరిగా లేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో జరిగిన చర్చలో అమిత్ షా నిన్న మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయన ప్రసంగంపై ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అమిత్ షా నిన్న కంగారుగా కనిపించారని అన్నారు.
ప్రసంగం సమయంలో అమిత్ షా చేతులు కూడా వణుకుతూ కనిపించాయని, ఏ ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదని విమర్శించారు. తాను మాట్లాడిన వాటికి వేటికీ ఆధారం చూపించలేదని అన్నారు. మీడియా ముందు తాను చేసిన వ్యాఖ్యలన్నింటినీ పార్లమెంటులో చర్చిద్దామని ఆయనకు సవాల్ విసిరినప్పటికీ ఆయన నుంచి సమాధానం రాలేదని అన్నారు.
![]()
