దేశ గ్రామీణ ఉపాధి వ్యవస్థలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో సరికొత్త చట్టాన్ని తీసుకురానుంది. “వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)
బిల్లు, 2025″ పేరుతో రూపొందించిన ఈ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ఉపాధి, అభివృద్ధి కార్యక్రమాలను తీర్చిదిద్దడమే ఈ కొత్త చట్టం ముఖ్య ఉద్దేశం.
![]()
