ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం మీరట్లో నమో భారత్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టిఎస్), మీరట్ మెట్రోను ప్రారంభించారు. నమో భారత్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో డిజైన్ చేసిన
భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఇది ఢిల్లీని ఘజియాబాద్, సాహిబాబాద్, మోదినగర్, మీరట్ వంటి ఉత్తరప్రదేశ్ నగరాలతో కలుపుతుంది. ఈ రైలు ఢిల్లీ, మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని ఐదు గంటల నుంచి 45-50 నిమిషాలకు తగ్గిస్తుంది. మీరట్ మెట్రో భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన స్థానిక మెట్రో రైలు వ్యవస్థ. ఇది గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట ఆపరేటింగ్ వేగంతో మీరట్ సౌత్, మోడిపురం మధ్య నడుస్తుంది. మీరట్ మెట్రో నమో భారత్ ఆర్ఆర్టిఎస్కు చెందిన మౌలిక సదుపాయాలపైనే పనిచేస్తుంది. ఇది ప్రయాణికులకు ప్రాంతీయ, నగరం లోపల సేవలను సులభంగా మార్చుకోవడానికి వీలు కల్పిస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రధాని మోడీ శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్ నుండి దీన్ని ప్రారంభించారు. గతంలో సూర్యాస్తమయం తర్వాత నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలు ఇప్పుడు ఆధునిక, సురక్షితమై, సమర్థవంతమైన రవాణా వ్యవస్థలతో అనుసంధానించామని మోడీ పేర్కొన్నారు. శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని, ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం లభిస్తుందని ఆయన అన్నారు.
![]()
