భారత క్రీడా రంగానికి గడిచిన నెల ఒక సూపర్ హిట్ నెలగా నిలిచిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 128వ
ఎపిసోడ్లో ఆయన మాట్లాడుతూ.. పలు అంతర్జాతీయ క్రీడా పోటీలలో భారత క్రీడాకారులు సాధించిన అద్భుత విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. క్రికెట్ నుంచి కబడ్డీ, బాక్సింగ్ వరకు వివిధ రంగాల్లో మన అథ్లెట్లు దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, “భారత క్రీడా రంగం పరంగా ఈ నెల ఒక సూపర్ హిట్గా నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ గెలవడంతో ఈ నెల ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా క్రీడా మైదానాల్లో మన వాళ్ల జోరు కొనసాగింది. కొద్ది రోజుల క్రితం టోక్యోలో జరిగిన డెఫ్లింపిక్స్లో భారత క్రీడాకారులు 20 పతకాలు సాధించి, ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు” అని తెలిపారు.
![]()
