భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ చేరుకున్నారు. టెల్ అవీవ్‌లోని బెన్-గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆయనకు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా వచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి నెతన్యాహు స్వాగతం పలకడం రెండు దేశాల మధ్య ఉన్న స్నేహబంధానికి ప్రత్యేక సంకేతంగా నిలిచింది.
![]()
