రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికొన్ని గంటల్లో భారత్‌కు చేరుకోనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తరువాత పుతిన్‌కు ఇది తొలి భారత పర్యటన. మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఏళ్లతరబడి కొనసాగుతుండటం ఐరోపా దేశాల్లో గుబులు రేపుతోంది. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటనను పురస్కరించుకుని ఐరోపా దేశాలు భారత్ సాయం కోసం తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి..
యుద్ధాన్ని విరమించేందుకు పుతిన్‌కు నచ్చ చెప్పాలంటూ అనేక దేశాల ప్రతినిధులు, దౌత్యవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రధాని మోదీకి పుతిన్ ఫ్రెండే కాబట్టి ఆయన మాట వినే అవకాశం ఎక్కువగా ఉందని ఐరోపా దేశాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి మర్యాదపూర్వకంగా కోరాయట.
![]()
