న్యూఢిల్లీ
: కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ సర్కార్ తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. పార్లమెంట్ ఆవరణలోని మకరద్వారం ఎదుట కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, డిఎంకె, టిఎంసి, ఎన్‌సిపి, ఆర్జెడి, ఎస్పి, ఐయుఎంఎల్ తదితర ప్రతిపక్ష నేతలు బుధవారం ఆందోళన చేపట్టారు. ‘కార్పొరేట్ జంగిల్ రాజ్ వద్దు – కార్మికులకు న్యాయం కావాలి’ అంటూ భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని నేతలు ప్లకార్డులు చేబూని పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకమని, కార్పొరేట్లకు అనుకూలమని విమర్శించారు.
![]()
