సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచివేసేందుకు గత ప్రభుత్వాలు చాలా హేయమైన ప్రయత్నాలు చేశాయని ప్రధాని మోదీ అన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్నాయని.. అలాంటి విభజన, బుజ్జగింపు శక్తులను మనమంతా ఐక్యంగా, దృఢంగా ఉండి ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆలయ పునరుద్ధరణ తర్వాత కూడా బానిస మనస్తత్వంతో దాని వారసత్వాన్ని తక్కువ చేసేందుకు చూశారని ధ్వజమెత్తారు.
![]()
