పూర్తి స్థాయిలో అన్ని విమానాలు నడపడంలో విఫలమైనందున 10 శాతం విమానాల్లో కోత విధించాలని ఇండిగోకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. తమ విమాన సర్వీసులు దాదాపు సాధారణ స్థితికి వచ్చాయని ఇండిగో సంస్థ మంగళవారం పేర్కొన్నప్పటికి కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తరపున పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డిజిసిఎ) ఇండిగోకు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఇండిగో రోజుకు సుమారు 2200 సర్వీసులు నిర్వహిస్తున్నందు వలన 200కు పైగా సర్వీసులను రద్దు చేయాల్సి ఉంటుంది.
కాగా, మరోవైపు ఇండిగో సిఇఓ పీటర్ అల్బర్స్ ఒక వీడియో ప్రకటనలో ఎయిర్లైన్స్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో స్థిరీకరించబడ్డాయని, సంస్థ వెబ్సైట్లో కనిపించే విమానాలు సర్దుబాటు చేసిన నెట్వర్క్్తో షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని తెలిపారు. డిసెంబరు 8నాటికి, తమ నెట్వర్క్్లోని 138 ప్రాంతాలకు విమానాలు నడిపామని చెప్పారు.
![]()
