దేశ ప్రజలపై కేంద్రంలోని మోడీ సర్కారు మరో భారం మోపింది. ఈ ఏడాది జులైలో ఒకసారి ఛార్జీలు పెంచిన భారతీయ
మరోసారి ఛార్జీలను పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించింది. సాధారణంగా సామాన్యులు దూర ప్రాంతాలకు వెళ్ల్లాలంటే తొలుత రైల్వేనే ఎంపిక చేసుకుంటారు. వారినే లక్ష్యంగా చేసుకుని ఛార్జీలను పెంచడం గమనార్హం. జనరల్ క్లాస్‌లో 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచాలని నిర్ణయించింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎయిర్ కండిషన్డ్ లేని (నాన్ ఎసి) కోచ్‌ల్లో ప్రయాణాలకు కిలోమీటరుకు 2 పైసలు పెంచింది. ఎయిర్ కండిషన్డ్ (ఎసి) కోచ్‌లలో ప్రయాణ ఖర్చు కూడా కిలోమీటరుకు 2 పైసలు పెరిగింది. ఫస్ట్ క్లాస్ ఎసిలో ప్రయాణించే ధనవంతులతో సమానంగా స్లీపర్ బోగీలో ప్రయాణించే సాధారణ ప్రయాణికుడిపై భారం మోపడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాన్ ఎసి, ఎసి కోచ్‌ల్లో ప్రయాణాలకు ప్రతి 500 కిలోమీటర్ల దూరానికి ఇప్పుడున్న టికెట్ రేటుపై రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంది. పెరిగిన కొత్త ఛార్జీలు ఈ నెల 26 నుంచి అమలులోకి వస్తాయని రైల్వే తెలిపింది. సబర్బన్ రైలు ప్రయాణ ఛార్జీలను రైల్వే పెంచలేదు. 215 కిలోమీటర్ల దూరం వరకు జనరల్ క్లాస్ రైలు టికెట్ల రేట్లలో ఎలాంటి మార్పూ లేదు. ఛార్జీల పెంపు వల్ల రైల్వే ఆదాయం ఏటా రూ.600 కోట్లు పెరుగుతుందని రైల్వే బోర్డు పేర్కొన్నా వాస్తవంలో అధి ఇంకా ఎక్కువగానే వుంటుందని పరిశీలకుల భావన.
![]()
