ఒడిశాలోని కంధమాల్లో జరిగిన ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా.. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ కూడా హతమైనట్లు ప్రకటించారు. 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలిస్తామని అమిత్ షా మరోసారి ఉద్ఘాటించారు. ఒడిశాను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారుస్తామని స్పష్టం చేశారు.
![]()
