వంట గ్యాస్ కొరతకు సంబంధించి బ్లాక్ మార్కెట్‌ను రాష్ట్రాలే నిరోధించాలని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) లేదా ఫ్యూయల్ ఆయిల్ వంటి ఇంధనాలకు ఎటువంటి కొరత లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ వురి గురువారం పార్లమెంట్లో వెల్లడించారు. వినియోగదారుల ఆందోళన కారణంగానే పంపిణీదారులు, రిటైల్ స్థాయిలో నిల్వ, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని, సరఫరా కొరత లేదని ఆయన లోక్‌సభలో తెలిపారు. భారతదేశం గతంలో గల్ఫ్ దేశాల నుండి 60 శాతం ఎల్‌పిజిని దిగుమతి చేసుకునేదని, 40 శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతుందని వివరించారు.
![]()
