దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిని సూచిస్తూ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి ఆశాజనకమైన వృద్ధిని నమోదు చేశాయి. 2025 డిసెంబరు నెలలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి రూ.1,74,550 కోట్ల ఆదాయం సమకూరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2024 డిసెంబరులో నమోదైన రూ.1,64,556 కోట్లతో పోలిస్తే ఇది 6.1 శాతం అధికం కావడం గమనార్హం.
![]()
