గ్రూప్ దశలో అద్భుత ప్రదర్శనతో అజేయంగా ముందుకు సాగిన భారత జట్టు ఇప్పుడు సూపర్-8లో కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి సూపర్-8 మ్యాచ్‌లో తలపడనుంది. భారీ ప్రేక్షకుల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కు ఉత్కంఠ తారాస్థాయిలో ఉంది. సొంతగడ్డపై ఆడుతున్న భారత్‌కు ప్రేక్షక మద్దతు పెద్ద బలంగా మారనుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై ఆందోళన పడవద్దని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డాడు. అభిషేక్ తప్పకుండా ఫామ్ అందుకొంటాడనే నమ్మకం తనకు ఉందని, సూపర్-8లో అతడి బ్యాట్నుంచి పరుగుల వరద పారడం ఖాయమన్నాడు.
![]()
