విశాఖపట్టణం వేదికగా భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (106) సెంచరీతో రాణించాడు. కెప్టెన్ టెంబా బవుమా (48) ఫర్వాలేదనిపించాడు. టీమ్ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ్ కృష్ణ 4, అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
![]()
