టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. మహారాష్ట్ర కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్.. దేశవాళీ క్రికెట్లో ఓ సంచలన రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ 134 పరుగులతో అద్భుత సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు (15) చేసిన బ్యాటర్‌గా ఆ జట్టుకే చెందిన అంకిత్ బావ్నే రికార్డును సమం చేశాడు.
![]()
