నీలి సముద్రాన్ని తలపిస్తున్న స్టేడియం సాక్షిగా భారత క్రికెట్లో మరో కీర్తి కిరీటం చేరింది. క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టి20 ప్రపంచకప్-2026 ఫైనల్ పోరులో భారత జట్టు అజేయశక్తిగా నిలిచింది. లక్షలాది గొంతుకల జయజయ ధ్వానాల మధ్య, అహ్మదాబాద్ వేదికగా ‘విశ్వరూపం’ ప్రదర్శించింది. ఆదివారం జరిగిన తుది పోరులో బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆధిక్యతను ప్రదర్శించి, న్యూజిలాండ్‌ను మట్టికరిపించి, టీమ్ ఇండియా ‘జగజ్జేత’గా పట్టాభిషేకం చేసుకుంది. 2007లో జోహన్నెస్‌బర్గ్‌లో మొదలైన ఈ విజయ యాత్ర, 2024లో బార్బడోస్‌ను దాటుకుని, ఇప్పుడు 2026లో అహ్మదాబాద్ వేదికగా సరికొత్త చరిత్రను లిఖించింది. పొట్టి ఫార్మాట్లో వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడి.. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే ఏకైక జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 
![]()
