తొలి వన్డేలో నెగ్గిన
ఒక రెండో వన్డేపై దృష్టి సారించింది. రారుపూర్ వేదికగా బుధవారం జరిగే రెండో వన్డేలో టీమిం డియా గెలిస్తే.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకోనుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాంచీ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా నెగ్గి 1-0 ఆధిక్యతలో నిలిచింది. హోరాహోరీగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 17 పరుగుల తేడాతో సఫారీ లను ఓడించి సిరీస్లో ఆధిక్యాన్ని సాధించింది. మంగళవారం రారుపూర్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని చిన్నారులు చుట్టుముట్టి గులాబీలతో ఘనంగా స్వాగతం పలికారు. తొలి వన్డేలో గెలిచిన టీమ్ ఇండియా ఇప్పుడు రెండో వన్డేకి సిద్ధమవుతోంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాకు టెస్టు సిరీస్ను చేజార్చుకున్న భారత జట్టు.. వన్డేల్లో మాత్రం శుభారంభం చేసింది.
![]()
