భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు
ల సిరీస్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. భారత పర్యటనకు వచ్చిన సఫారీ జట్టు టెస్ట్ సిరీస్‌ను చేజిక్కించుకోగా.. భారతజట్టు వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జరిగే టి20 సిరీస్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో..! ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా తొలి టి20 సమరం జరగనుంది. టెస్ట్ సిరీస్ మధ్యలో గాయం కారణంగా వైదొలిగిన శుభ్‌మన్ గిల్ ఫిట్నెస్ సాధించాడు. దీంతో అతడు టి20ల్లో బరిలోకి దిగనున్నాడు. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. వికెట్ కీపర్‌గా సంజు శాంసన్, టి20 స్పెషలిస్ట్ బ్యాటర్లు దూబే, రింకు సింగ్‌లకు చోటు ఖాయం. మిస్టరీ స్పిన్నర్ వరణ్ చక్రవర్తికి తోడు కుల్దీప్ రాణిస్తే సఫారీలను చిత్తు చేయడం ఖాయం.
![]()
