ఐసిసి టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు టీమిండియా వరుసగా రెండోసారి ప్రవేశించింది. వెస్టిండీస్, అమెరికా వేదికగా 2024లో జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరి టైటిల్‌ను కొట్టిన భారతజట్టు ముచ్చటగా మూడోసారి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు నిర్ణీత 20
ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 253పరుగుల భారీస్కోర్ నమోదు చేసినా.. టీమిండియాకు ఆషామాషీగా ఏం విజయం దక్కలేదు. ఇంగ్లండ్ ఓపెనర్ బేథెల్(105; 48బంతుల్లో 8ఫోర్లు, 7సిక్సర్లు) చివరి వరకు పోరాడుతూనే ఉన్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. బేథెల్ పోరాటం ఆగలేదు. ఇంగ్లండ్ విజయానికి చివరి ఓవర్లో 30పరుగులు కావల్సిన దశలో బేథెల్ రనౌటవ్వడం, ఆ తర్వాత బంతికి ఒక్క పరుగే రావడంతో టీమిండియాకు విజయం ఖాయమైంది. కాని చివరి 3బంతులను జోఫ్రా ఆర్చర్ సిక్సర్లు కొట్టినా.. అప్పటికే టీమిండియాకు గెలుపు లాంచనమే అయ్యింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సంజు శాంసన్‌కు దక్కింది.
![]()
