టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కరను అధిగమించాడు. ఈ జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మాత్రమే కోహ్లీ కన్నా ముందున్నాడు.
![]()