సిసి టి20 ప్రపంచకప్ సెమీస్ రేసులో టీమిండియా నిలిచింది. చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో గురువారం జరిగిన కీలక పోరులో టీమిండియా 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 256పరుగుల భారీస్కోర్ నమోదు చేసింది. టి20 ప్రపంచకప్ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్. భారీ ఛేదనలో జింబాబ్వే నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 184 పరుగులే చేసింది. ఓపెనర్ బెన్నెట్(97నాటౌట్; 59బంతుల్లో 8ఫోర్లు, 6సిక్స ర్లు)కి తోడు కెప్టెన్ సికిందర్ రాజా(31) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. చివరకు కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక జింబాబ్వే 184పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో ఆర్ష్‌దీప్ సింగ్‌కు మూడు, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, దూబేకు ఒక్కో వికెట్ దక్కాయి. ఈ గెలుపుతో భారతజట్టు గ్రూప్-1లో 2వ స్థానానికి ఎగబాకింది. మార్చి 1న ఆదివారం వెస్టిండీస్‌పై భారతజట్టు గెలిస్తేనే సెమీస్ బెర్త్ దక్కనుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యాకు దక్కింది.
![]()
