టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో బరోడా తరఫున ఆడిన పాండ్యా, తన కెరీర్లో తొలి లిస్ట్-ఏ సెంచరీతో చెలరేగిపోయాడు. శనివారం నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు.
ఈ మ్యాచ్‌లో బరోడా జట్టు 20 ఓవర్లలో 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్, తొలుత ఆచితూచి ఆడుతూ 44 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా గేరు మార్చి విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ 39వ ఓవర్లో ఏకంగా 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 34 పరుగులు రాబట్టి కేవలం 68 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు.
![]()
