ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన ఎడిషన్‌గా రికార్డులకెక్కింది. కేవలం భారత్‌లోనే ఈ టోర్నమెంట్‌ను వీక్షించిన వారి సంఖ్య 50 కోట్లు దాటడం విశేషం. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధికం.
ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ టోర్నమెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించామని, భారత్‌లో 50 కోట్ల వ్యూయర్షిప్ దాటడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అదే సమయంలో జియో హాట్‌స్టార్‌లో ఒకేసారి 6.05 కోట్ల మంది వీక్షించడం అద్భుతమని పేర్కొన్నారు.
![]()
