దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బారాబతి స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో పాండ్యా తన ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
![]()
